రాష్ట్రంలో కోలుకున్న కరోనా తొలి బాధితుడు..

431
carona
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఎంతో మంది ప్రాణాలను కబళిస్తోంది. కాగా తెలంగాణలో తాజాగా కరోనా అనుమానాలతో చేరిన 8 మందితో కలిపి గాంధీలో చికిత్స పొందుతున్న ఆ బాపతు బాధితుల సంఖ్య 40కి చేరుకుంది. అయితే రాష్ట్రంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొలి కరోనా బాధితుడు కోలుకున్నట్టు తెలుస్తోంది.

తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు రావడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, జ్వరం తగ్గిందని, బీపీ నియంత్రణలోకి వచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే మరోసారి నిర్ధారణకు అతడి నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించనున్నట్లు సమాచారం.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ఈ యువకుడు దుబాయ్‌ వెళ్లి వచ్చి కరోనా బారినపడ్డాడు. అనంతరం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స, వైద్యుల నిరంతర పర్యవేక్షణతో క్రమంగా యువకుడి ఆరోగ్యం కుదుటపడింది. తొలి మూడు రోజులు ఎలా ఉంటుందో? ఏమౌతుందోనని ఆందోళన చెందిన వైద్యులు ఇప్పుడిక ఇబ్బంది లేదని నిర్ధారణకు వచ్చారు. ఇక కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.

- Advertisement -