గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులను దహిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటి రూ.110కి చేరువగా వెళుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.64 అయింది. రూ.101.27 గా ఉన్న డీజిల్ ధరలో మాత్రం స్వల్పంగా పెరిగి.. ప్రస్తుతం రూ.101.66కి చేరింది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.108.36గా ఉంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.101.38 గా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.0.01 పైసలు పెరిగి.. రూ.108.82గా ఉంది. డీజిల్ ధర రూ.0.01 పైసలు పెరిగి రూ.101.81 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.02 పైసలు పెరిగి రూ.110.11 గా ఉంది. డీజిల్ ధర రూ.0.01 పైసలు పెరిగి రూ.103.01 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.110.92 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.29 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.27 పైసలు పెరిగి రూ.103.32కు చేరింది. విశాఖపట్నం లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.73గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.23 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.102.19గా ఉంది. తిరుపతిలో లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.22 పైసలు తగ్గి.. రూ.110.55 కు చేరింది. ఇక డీజిల్ ధర రూ.102.94గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఏకంగా రూ.0.17 పైసలు తగ్గింది.
ఇక ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి..
దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.44, ముంబై రూ. 110.41, భువనేశ్వర్ రూ. 103.27 , పాట్నా రూ. 107.64 గా ఉంది. త్రివేండ్రం రూ. 106.41 గా ఉంది. చెన్నై రూ. 101.79, ,గుర్గావ్ రూ. 99.98, నోయిడా రూ. 101.70, బెంగళూరు రూ. 108.08గా లభిస్తోంది.