మీడియాకు యాంకర్‌ అనసూయ వార్నింగ్‌..!

15
Anchor Anasuya

యాంకర్‌ అనసూయ మీడియాపై సీరియస్‌ అయ్యింది. మంగ‌ళవారం ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌కి సంబంధించిన వారంద‌రు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ..మా ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుండి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో యాంకర్ అనసూయ సైతం పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో మా ఎన్నికలపై స్పందించిన అనసూయ.. నేను 11 ఏళ్లుగా ఇక్కడ ఉన్నాను.. ఈరోజు అందరి సమక్షంలో చెప్తున్నాను.. నిజాలు తెలుసుకోకుండా నా పేరు తీశారంటే కోర్టుకి వెళ్తాను. నా ప్రమేయం లేకుండా నా పేరు తప్పుడు వార్తలకు వాడితే.. తప్పకుండా కోర్టుకి వెళ్తాను’ అని వార్నింగ్ ఇచ్చింది అనసూయ.

మా ఎన్నికల లెక్కింపు సమయంలో నేను మెజార్టీలో ఉన్నానని కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. నేను మీడియాలో ఉంటే న్యూస్‌ రిపోర్ట్‌ చేయడాన్ని ఎంచుకుంటాను. క్రియేట్‌ చేయను. గాలి వార్తలు చెప్పను. కచ్చితంగా ఎన్నికల అధికారులు ప్రకటిస్తేనే చెబుతాను. ఓట్ల లెక్కింపు దగ్గర ఎవరో ఇచ్చిన సమాచారాన్ని నేను నమ్మను అంటూ అన‌సూయ మండిప‌డింది. అనసూయ ఓడిపోయాననే ఫ్రస్ట్రేషన్‌‌లో ఇలా మీడియాపై చిందులు తొక్కింది.