బిగ్ బాస్ 5: 38వ ఎపిసోడ్‌ హైలైట్స్..

22

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 38 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మామూలుగా లేదు..ఇప్పటికే ఇంటినుండి 5గురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.కాగా సోమవారం జరిరిగిన నామినేషన్‌ ప్రక్రియతో బిగ్‌బాస్‌ ఇళ్లంతా గంభీరంగా మారింది. ఆరోవారంలో అత్యధికంగా 10 మంది( షణ్ముఖ్‌, ప్రియాంక సింగ్‌, లోబో, శ్రీరామ్‌, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ )నామినేట్‌ అయ్యారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే..నామినేషన్‌ ప్రక్రియతో బాగా హర్ట్‌ అయిన ఇంటి సభ్యులను కూల్‌ చేసే పనిలో పడ్డాడు బిగ్‌బాస్‌.

బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో ప్ర‌తి వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా టాస్క్‌లు ఇస్తున్న‌విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ వారం హౌజ్‌మేట్స్‌ని నాలుగు టీమ్‌లుగా విడ‌గొట్టారు. బ్లూ టీమ్‌లో సభ్యులు: మానస్‌, సన్నీ, యానీ మాస్టర్‌; ఎల్లో టీమ్‌ సభ్యులు షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ; రెడ్‌ టీమ్‌ సభ్యులు : విశ్వ, శ్రీరామ్‌, ప్రియ; గ్రీన్‌ టీమ్‌ సభ్యులు : రవి, లోబో, శ్వేత ఉన్నారు. సిరి, కాజల్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌, సంచాలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు బిగ్ బాస్.

రెడ్ అండ్ గ్రీన్ టీంకి మేనేజర్స్‌గా సిరిని.. బ్లూ, ఎల్లో టీంకి కాజల్‌కి మేనేజర్స్‌గా నియమించారు. బొమ్మ‌ల నాణ్య‌త‌ని వీరు స‌రిగ్గా ప‌రిశీలించాల్సి ఉంటుంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం ప్ర‌తి టీమ్ ప్ర‌త్య‌ర్ధుల టీం కన్నా ఎక్కువ బొమ్మ‌లు త‌యారు చేయాలి. గెలిచిన టీంకి మేనేజర్‌గా ఉన్నవాళ్లకి కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. రా మెటీరియ‌ల్‌తో బొమ్మ‌ల‌ని స‌రిగ్గా చేయ‌క‌పోవ‌డంతో కోపోద్రిక్తుడైన మాన‌స్‌… ఇదో పత్తేపారం.. బొమ్మల్లో పత్తి లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అని అన్నాడు మాన‌స్‌.

టాస్క్ జ‌రుగుతున్న స‌మయంలో అనీ మాస్ట‌ర్, సిరి మ‌ధ్య మాటల యుద్ధం జ‌రిగింది. బ‌జ‌ర్ మోగిన బొమ్ములు తెస్తే నేను యాక్సెప్ట్ చేయ‌ను. సంచాల‌కులు స‌రిగ్గా చూడాలి అని అనీ మాస్ట‌ర్‌గా దానికి స్పందించిన సిరి.. మాకు ఎవ‌రు ఏం చెప్పాల్సిన ప‌ని లేదు. సంచాల‌కురాలిగా ఏం చేయాలో మాకు తెలుసు అని మండిప‌డింది. గేమ్ ఫెయిర్‌గా ఆడుతున్న కూడా ష‌ణ్ముఖ్ ఉన్న టీంకి స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు మాట్లాడుతున్నారు. గేమ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి ఆడు అని ష‌ణ్ముఖ్ సిరిని కూల్ చేశాడు.

ఈ టాస్క్‌లో గ్రీన్‌ టీమ్‌ సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్‌ పవర్ లభించింది. స్పెషల్ బొమ్మ రావడంతో దాని ద్వారా వేరే టీం దగ్గర ఉన్న బొమ్మల్ని తీసుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. నేటి ఎపిసోడ్‌లో అనీ మాస్ట‌ర్‌, శ్వేత‌ల మ‌ధ్య పెద్ద ర‌ణరంగ‌మే జ‌రిగిన‌ట్టు ప్రోమో ద్వారా తెలుస్తుంది.

Captaincy contender task "BB Bommala Factory" #Siri Vs #Anee .. #BiggBossTelugu5 today at 10 PM