కొత్త వంద నోటు వచ్చేసింది..

255
100 Rupee New Note
- Advertisement -

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 1న కొత్త 100 రూపాయల కరెన్సీని చలామణిలోకి తేగా, బ్యాంకుల నుంచి పలువురు వాటిని అందుకుని బాగున్నాయంటూ ప్రశంసిస్తున్నారు. ముందుబాగంలో మహాత్మా గాంధీ బొమ్మ, వెనుకవైపు ‘రాణికీ వాస్’ ముద్రించి వున్న ఈ నోటు లావెండర్ రంగులో ఉంది. ఇక గులాబీ రూ.2000 నోటు, పసుపు రూ.200 నోటు, ఆకుపచ్చ రూ.50 నోటు.. రంగురంగుల్లో కరెన్సీ నోట్లను ముద్రించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కొత్తగా లావెండర్ రంగులో రూ.100 నోటు అందుబాటులోకి తీసుకొచ్చింది.

100 Rupee New Note

142 ఎంఎం పొడవు, 66 ఎంఎం వెడల్పుతో, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తయారు చేసినట్టు ఆర్బీఐ పేర్కొంది. గాంధీతో పాటు అశోకుడి నాలుగు సింహాలు, వాటర్ మార్క్, స్వచ్ఛ భారత్ లోగో తదితరాలు కూడా ఈ నోటుపై ముద్రించి వున్నాయి. ఈ నోట్లతో పాటు ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ. 100 కరెన్సీ కూడా చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ పేర్కొంది.

- Advertisement -