- Advertisement -
దేశంలో ప్రతిరోజూ పెట్రో ధరలు మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై 32 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోలు లీటరుకు 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. దీంతో అక్కడ లీటరు పెట్రోలు రూ.87.85, డీజిల్ రూ.78.03కి చేరింది.
ముంబైలో లీటరు పెట్రోలు రూ.94.36, డీజిల్ రూ.84.94కి చేరింది.గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.93.93, డీజిల్ ధర రూ.87.20గా ఉంది. విజయవాడలో లీరు పెట్రోల్ ధర రూ.93.73కి, లీటరు డీజిల్ ధర రూ.87కి పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 26 పైసలు పెరిగి రూ.91.35కి చేరింది. అలాగే, డీజిల్ ధర లీటరుకి 32 పైసలు పెరిగి రూ.85.11కి పెరిగింది.
- Advertisement -