క్యూనెట్…సెలబ్రెటీలకు నోటీసులు:సజ్జనార్

840
cp sajjanar
- Advertisement -

2001 లో గోల్డ్ క్వెస్ట్, 2007 లో క్వెస్ట్ నెట్, ఇప్పడు క్యూనెట్ గా పేర్లు మార్చుకుని దేశవ్యాప్తంగా అమాయక ప్రజలను మోసం చేశారని సీపీ సజ్జనార్‌ తెలిపారు.క్యూనెట్ రూపంలో ఇప్పటివరకు 5 వేల కోట్ల రూపాయల వరకు మోసాలకు పాల్పడ్డారని…….క్యూ నెట్ లో అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సెలెబ్రెటీస్ అందరికి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.

ఇప్పటివరకు 38 కేసులు నమోదు చేసి, 70 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.ఇది ఒక మోసపూరిత కంపెనీ అని మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ ఎఫైర్స్ (MCA) ద్వారా రిపోర్ట్ వచ్చిందని.. దీనిని మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు.ఈ కంపెనీ ROC బెంగళూర్ లో రిజిస్టర్ అయ్యిందని….ఇంట్లో ఉంటూ సులువుగా డబ్బు సంపాదించవచ్చు అంటూ మొటివెషనల్ స్పీచ్ లు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతుంటారని చెప్పారు.

క్యూనెట్ సంస్థ వివిధ రకాల కంపెనీల పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారు….ముఖ్యంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జనార్.క్యూనెట్‌ కంపెనీకి చెందిన 12 మంది కి దేశం విడిచి పోకుండా నోటీసులు జారీ చేశామని…ఇలాంటి మనీ సర్కులేటెడ్ వ్యాపారాల భారిన పడి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఇలాంటి కేసుల్లో ఉన్న బాధితులకు ఎలాంటి పరిహారం లభించదన్నారు.

- Advertisement -