జూన్‌లో ‘పెళ్ళికి ముందు ప్రేమకథ’..

211
Pelliki Mundu Prema Katha Releasing on June 9th
- Advertisement -

చేతన్‌ శీను, సునైన హీరో హీరోయిన్లుగా మధు గోపు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘పెళ్ళికి ముందు ప్రేమకథ’. డి.ఎస్‌.కె, అవినాష్‌ సలండ్ర, సుధాకర్‌ పట్నం నిర్మాతలు. ప్రేమ్‌ కుమార్‌ పాట్ర, మాస్టర్‌ అవినాష్‌ సలండ్‌ సమర్పణలో గణపతి ఎంటర్‌టైన్మెంట్స్‌, పట్నం ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై రూపొందుతోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Pelliki Mundu Prema Katha Releasing on June 9th

ఈ సందర్భంగా దర్శకత్వ పర్యవేక్షకుడు డి.ఎస్‌.రావు మాట్లాడుతూ.. ‘చెప్పిన కథ నచ్చింది. అయితే సినిమాను తీయగలుగుతామా? అని ఆలోచిస్తున్న సమయంలో సుధాకర్‌ నన్ను కలిశాడు. అలా నలుగురుగా కలిసి నా దర్శకత్వ పర్యవేక్షణలో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ, ఛాలెంజింగ్‌ తీసుకుని చేశాను. రొమాన్స్‌, ఎంటర్‌టైన్మెంట్‌ అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకుని తీశాము. అవసరాల శ్రీనివాస్ మా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. విడుదల చేసిన ట్రైలర్-ఆడియోకి మంచి స్పందన లభించింది. సినిమాకి కూడా అదే స్థాయిలో అలరిస్తుందని ఆశిస్తున్నాం” అన్నారు!

- Advertisement -