జూన్‌లో సై అంటున్న సాహో..

576
- Advertisement -

హీరో ప్రభాస్ తన తాజా చిత్రం సాహో షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే‘సాహో’ గురించి లేటెస్ట్ అప్డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు.  ‘బాహుబలి’కి జోడీగా ఏ బాలీవుడ్‌ భామని తీసుకోవాలనుకుంటున్నారు.. షూటింగ్‌ ఎక్కడ జరగబోతోంది అన్న విషయాలన్నీ ‘సాహో’పై ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. అయితే బాహుబలి-2 సక్సెస్ తర్వాత అమెరికాలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ప్రబాస్.. అక్కడినుంచి హైదరాబాద్ కు తిరిగిరాగానే సాహో సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు.
 saho movie shooting starts from june
ఈ చిత్రానికి సంబంధించి వచ్చే నెలలో కొన్ని సన్నివేశాలను ముంబైలో షూట్ చేస్తారని తెలుస్తోంది. ముంబై తర్వాత అబూధాబీలో ఎక్కువభాగం షూటింగ్ జరుగుతుందని, ఫైట్ సీన్స్ ని యూరప్ లో చిత్రీకరిస్తారని అంటున్నారు. బాహుబలి చిత్రం కోసం అయిదేళ్ళు కష్టపడిన ప్రభాస్.. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న సాహో చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయనున్నాడని సమాచారం. ఆ తర్వాత బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌తో కలిసి హిందీ చిత్రంలో నటించే అవకాశాలున్నట్లు టాలీవుడ్‌ టాక్‌.
  saho movie shooting starts from june
ప్రస్తుతం రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహో ..తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పనిచేయనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతాన్ని అందించనున్నారు. ఇక ‘ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

- Advertisement -