పెద్దపల్లి కాంగ్రెస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడంపై స్థానిక నేతలు అసమ్మతి గళం వినిపించారు. ఒకే కుటుంబంలోని వారికి పదవులు ఇవ్వడం సరికాదని విమర్శలు గుప్పించారు.
మొన్న తండ్రికి, పెద్దనాన్నకు, నేడు కొడుకుకు టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. బహిరంగంగానే విమర్శలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీలో దళితులు లేరా..? ఏళ్ల తరబడి కష్టపడుతున్న కార్యకర్తలు ఏం కావాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ కృష్ణను మార్చాలని డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్‌కు చెందిన యువజన కాంగ్రెస్ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ ఏప్రిల్ 5న న్యాయపోరాట దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. వివేక్ పార్టీకి రాజీనామా చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారిన ఆరోపించారు. ఒకే కుటంబానికి మూడు అవకాశాలు ఇచ్చారని, ఇలా అయితే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటని నిలదీశారు.
Also Read:KTR:బీఆర్ఎస్‌ను ప్రజలే కాపాడుకుంటారు