మాజీ ఎంపీ వివేక్‌కు షాక్‌..!

66
vivek

బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్‌పై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివేక్‌ తీరును తప్పుబడుతూ కొంతకాలంగా అలకపాన్పు ఎక్కిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు తోడుగా మరికొంతమంది నేతలు చేరారు. వివేక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్యెల్యేలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తదితరులు భేటీ అయ్యారు.

పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వివేక్‌ తీరుపై చర్చతో పాటు పార్టీలో కొనసాగాలా, కొనసాగితే ఏలా ముందుకు వెళ్లాలా అనే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

వివేక్‌పై అసంతృప్తితో గతంలో జిల్లా అధ్యక్ష పదవీకి సోమారపు రాజీనామా చేయగా.. అధిష్టానం చొరవతో వెనక్కి తగ్గారు. అయితే తాజాగా మరోసారి అసంతృప్త రాగం వినిపించడంతో బండి సంజయ్‌తో పాటు నేతలు తల పట్టుకుంటున్నారు.