హరీశ్‌ రావు మానవత్వం…

37
Harish

తన బర్త్ డే రోజున మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి హరీశ్ రావు. ఓ అనాథ బిడ్డ‌తో పాటు ఆటో కార్మికుని కుటుంబానికి అండ‌గా నిలిచారు.
త‌ల్లిదండ్రులు లేని భాగ్య అనే అనాథ‌ను కొన్నేండ్ల క్రితం సిద్దిపేట‌లోని బాల‌స‌ద‌నంలో హ‌రీష్ రావు చేర్పించారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు అన్ని తానై అండ‌గా నిలిచారు. గతేడాది ఆమెకు పెళ్లి కూడా చేయగా ఇవాళ తన బర్త్ డే సందర్భంగా డ‌బుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయడమే కాదు అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను అందించారు.

ఇటీవ‌ల అనారోగ్యంతో మ‌ర‌ణించిన ఆటో డ్రైవ‌ర్ పిడిశెట్టి దుర‌య్య కుటుంబానికి అండ‌గా నిలిచారు. ఆటో కో ఆప‌రేటివ్ సొసైటీ ద్వారా రూ. 2 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ చెక్‌ను దుర్గ‌య్య కుటుంబానికి హ‌రీష్ రావు అందించారు.