రైతుగా మారిన మాజీ సీఎం..!

32
kumaraswamy

లాక్ డౌన్ వేళ రైతుగా మారారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. వ్యవసాయం కోసం కొత్తగా ఓ ట్రాక్టర్ కొని మరీ సేద్యం ప్రారంభించారు. ట్రాక్టర్‌ని స్వయంగా నడుపుతూ పొలంలో దిగి వ్యవసాయ పనులు చేశారు.

కరోనా నేపథ్యంలో దేవెగౌడ, కుమారస్వామి కుటుంబం ఫామ్ హౌస్ లోనే నివాసం ఉంటున్నారు. ఇక పనిలో పనిగా ఇదే సమయంలో కుమారస్వామి తన వ్యవసాయ క్షేత్రాన్ని మోడల్​ ఫార్మ్​గా తీర్చిదిద్ది ఈ ఏడాది వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. దేవెగౌడ కుటుంబానికి కర్ణాటకలోని రామనగర జిల్లా కేతనహళ్లిలో ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇక్కడ కొన్నేళ్లుగా వ్యవసాయంతో పాటు ఇతర ఆహార పంటలు కూడా పండిస్తారు.