చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం..

185
KL Rahul
- Advertisement -

గురువారం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం అందుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్‌ మాయాజాలంతో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చిత్తుగా ఒడింది. 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్.. మరో 7 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేధించింది. ఈ క్రమంలో 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 139 పరుగులు చేసింది.

రాహుల్ 42 బంతుల్లో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టిన రాహుల్ తన జట్టుకు ఎంతో అవసరమైన గెలుపును అందించాడు. రాహుల్ స్కోరులో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మయాంక్ అగర్వాల్ 12, ఐడెన్ మార్ క్రమ్ 13 పరుగులు చేశారు. సర్ఫరాజ్ ఖాన్ (0), షారుఖ్ ఖాన్ (8) స్వల్పస్కోర్లకే అవుటయ్యారు.

కాగా, ఈ విజయంలో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ జట్లు ఆడే మ్యాచ్ ల జయాపజయాలపై పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్తు ఆధారపడి ఉంది. ఈ విక్టరీతో పంజాబ్ 12 పాయింట్లతో ఆరో స్ధానానికి ఎగబాకింది. ఆ జట్టు ప్లే ఆఫ్ కు చేరాలంటే ఇతర జట్టుల గెలుపోటములు, నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంది. చెన్నై 14 మ్యాచ్ ల్లో 9 విక్టరీలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌ రాహుల్ సూపర్ బ్యాటింగ్‌కు అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -