ఏపీలో కొత్తగా 643 కరోనా కేసులు నమోదు..

20
Corona

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,55,306కి చేరుకుంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 145 కేసులు నమోదు కాగా… అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8 మంది మృతి చెందారు. 839 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,32,520 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోగా… ప్రస్తుతం 8,550 యాక్టివ్ కేసులు ఉన్నాయి.