రాశి ఖన్నా తో నాగచైతన్య టిక్ టాక్(వీడియో)

376
venkymama

సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన యాప్ టిక్ టాక్. సినీ సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఈ యాప్ ను వాడుతున్నారు. ఈ టిక్ టాక్ యాప్ వల్ల చాలా మంది ఓవర్ నైట్ సెలబ్రెటీలు అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. పలువురు హీరోయిన్లు కూడా టీక్ టాక్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా ఓ విడియో పోస్ట్ చేసింది. వెంకీమామ ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్యతో కలిసి ఓ వీడియో చేసింది రాశి.

ఈ సినిమాలో వెంకటేష్ గోదావరిలో ఈత నేర్పా.. బరిలో ఆట నేర్పా.. ఇపుడు జాతరలో వేట నేర్పిస్తా .. రారా అల్లుడు అంటూ వెంకీ మామ ట్రైలర్‌లో వెంకటేష్ చెప్పిన డైలాగ్‌ను ఈ భామలిద్దరు డబ్ స్మాష్ చేసి కలిసి టిక్‌టాక్ వీడియో చేసారు. వెంకీ మామ చిత్ర యూనిట్ వెళుతున్న బస్సులో పాయల్ రాజ్‌పుత్,రాశీ ఖన్నా డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో చైతూ వస్తాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్య, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం వెంకీమామ. ప్రముఖ దర్శకుడు బాబీ ఈచిత్రానికి దర్శకత్వం వహించాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు.