పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరికీ అర్ధం కాడనే విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మొదట స్విట్జర్లాండ్ లో కాటమరాయుడు పాటలు తీద్దామని పవన్ భావించాడు కానీ.. గబ్బర్ సింగ్.. అత్తారింటికి దారేది.. సర్దార్ చిత్రాలకు అక్కడే షూటింగ్ చేశారు. అందుకే లొకేషన్ ను ఛేంజ్ చేశాడట పవన్. నిజానికి ఫారిన్ లొకేషన్ లో తీద్దామని భావించిన ఓ ఫోక్ సాంగ్ ను.. ఇక్కడే సెట్టింగ్స్ వేసి తీసేందుకు కారణం అయ్యాడు పవన్. అలాంటిది ఇఫ్పుడు సడెన్ గా ఇటలీ టూర్ బయల్దేరుతుండే సరికి ఆశ్చర్యపోతున్నారు అంతా. అది కూడా 10 రోజుల షూటింగ్ ప్లాన్ చేయడం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు పర్సనల్ గానే కాదు.. అటు షూటింగ్స్ పరంగా కూడా బాగా సెలెక్టివ్ గా ఉంటాడు పవన్. ప్రస్తుతం కాటమరాయుడును పూర్తి చేసే పనిలో ఉన్న పవర్ స్టార్.. సడెన్ గా ఇటలీ టూర్ ప్లాన్ చేశాడు. కొన్ని పాటల చిత్రీకరణ రేపు ఉదయం బయల్దేరి పవన్ వెళ్లనుండగా.. మరొక రోజులో శృతి హాసన్ కూడా యూనిట్ తో జత కానుంది.
అయితే.. భార్యా పిల్లలతో కలిసి పవన్ ఈ టూర్ ప్లాన్ చేశాడనే టాక్ ఉంది. ఇటు షూటింగ్.. అటు వెకేషన్ రెండూ కలిసొచ్చేలా పవన్ ఈ టూర్ ప్లాన్ చేశాడట. 10 రోజుల టూర్ అందుకే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. మార్చ్ 14 నాటికి మాత్రం పవన్ హైద్రాబాద్ వచ్చేయడం ఖాయం. ఎందుకంటే.. ఆ రోజున పవన్ తన పార్టీ జనసేన మూడవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంటుంది.