ఏపీ రాజకీయాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించిన చర్చ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటుంది. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న ఈ రెండు పార్టీలు.. పొత్తుకు కూడా సిద్దమైన సంగతి తెలిసిందే. విడివిడిగా పోటీ చేస్తే జగన్ ను ఓడించలేమని, కలిసి పోటీ చేస్తేనే వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయగలమని.. భావించిన పవన్, చంద్రబాబు పొత్తుకు సై అంటున్నారు. అయితే ఈ రెండు పార్టీలు కలిస్తే సిఎం అభ్యర్థి ఎవరనేది ప్రతిసారి తెరపైకి వస్తున్న ప్రశ్న. అటు చంద్రబాబు ఇటు పవన్ ఇద్దరు కూడా సిఎం పదవిపై గట్టిగానే దృష్టి పెట్టారు..
సిఎం పదవి కోసం చంద్రబాబు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో అటు పవన్ కూడా సిఎం కుర్చీ కోసం అంతే ఆశగా ఉన్నారు. అయితే పదవుల కోసం తాను పాకులాడనని, ఏ పదవి అయిన తన వద్దకే రావాలని ఆ మధ్య పవన్ చెప్పడంతో సిఎం పదవిపై పవన్ వెనుకడుగు వేశాడానే చర్చ జరిగింది. దాంతో టీడీపీ జనసేన పార్టీలు కలిస్తే సిఎం అభ్యర్థిగా చంద్రబాబు కన్ఫర్మ్ అని భావించారంతా కానీ ఇంతలోనే మళ్ళీ పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా చేబ్రోలులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
Also Read: సీన్ రివర్స్ : బీజేపీ వెనక్కి.. కాంగ్రెస్ ముందుకి ?
2024, 2029 ఎన్నికల్లో జనసేనను నమ్మండి అని, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ పవన్ చెప్పుకొచ్చారు. సిఎం గా తన పాలన నచ్చక పోతే స్వచ్చందంగా తానే పదవి నుంచి తప్పుకుంటానని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో పవన్ సిఎం పదవి కోసమే ప్రయత్నిస్తున్నట్లుగా అర్థమౌతోంది. అయితే టీడీపీతో కలిస్తే బాబును కాదని పవన్ కు సిఎం పదవి వరిస్తుందా అనేది సందేహమే. నిన్న మొన్నటి వరకు తనకు పదవి పై ఆశ లేదని చెప్పిన పవన్ మళ్ళీ ఇప్పుడు సిఎం పదవిపై కన్నేయడంతో పవన్ వైఖరి అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం కన్ఫర్మ్.. కానీ సిఎం అభ్యర్థి ఎవరనేది తెలియాలంటే ఎన్నికల టైమ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read: KTR:సుపరిపాలన కోసమే వార్డు కార్యాలయం