సీన్ రివర్స్ : బీజేపీ వెనక్కి.. కాంగ్రెస్ ముందుకి ?

31
- Advertisement -

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టం. రేస్ లో ముందున్న పార్టీ అనూహ్యంగా వెనుకకు పడిపోతుంది. అలాగే పనైపోయిందనుకున్న పార్టీ అనూహ్యంగా రేస్ లోకి వస్తుంది. ఇలా ఎవరి ఊహలకు అందని విధంగా రాజకీయ పార్టీల స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి రెండు జాతీయ పార్టీలైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానం బీజేపీదే నని, వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు పోటీనిచ్చి విజయం సాధిస్తామని జబ్బలు చరిచారు కమలనాథులు. కట్ చేస్తే కర్నాటక ఎన్నికల ఫలితాలతో అంచనాలన్నీ ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. .

గెలుస్తుందనుకున్న బీజేపీ అనూహ్యంగా ఓటమిపాలు కావడం, ఊహించని విధంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడం నిజంగా అంచనాలకు అందని విషయమే. ఇప్పుడు ఈ పరిణామమే తెలంగాణలో కూడా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు బి‌ఆర్‌ఎస్ తరువాత సెకండ్ ప్లేస్ లో ఉన్న బీజేపీ ప్రస్తుతం థర్డ్ ప్లేస్ కు పడిపోగా.. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అనూహ్యంగా బీజేపీని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది.

Also Read: విపక్షాలే టార్గెట్.. అదంతా షా వ్యూహమే !

బీజేపీ కంటే దూకుడుగా హస్తం పార్టీ వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు నేతల మధ్య సమన్వయ లోపం, ఆదిపత్య పోరు వంటి సమస్యలతో సతమతమైన హస్తం పార్టీ ఇప్పుడు అన్నిటిని పక్కన పెట్టి గెలుపుకోసం పరుగెడుతోంది. మరోవైపు బీజేపీ కర్నాటక ఫలితాలతో డీలా పడి ఎలా పైకి లేవాలనే దానిపై ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు తెలంగాణలో గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ కె గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మొత్తానికి కర్నాటక ఎన్నికల ఫలితాలతో రెండు జాతీయ పార్టీల ఫెట్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి.

Also Read: CMKCR:మార్చుకోవాల్సిన సమయం వచ్చింది

- Advertisement -