KTR:సుపరిపాలన కోసమే వార్డు కార్యాలయం

41
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్‌. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు ఇవాళ ప్రారంభంకాగా కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‎తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..వార్డు అధికారితోపాటు మొత్తంగా వార్డులో 10 మంది చొప్పున 150 వార్డులలో 1500 మంది అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండనున్నారని చెప్పారు.దీంతో ప్రజా సమస్యలు అక్కడిక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. సమస్యలు ఎంత సమయంలో పరిష్కారం చేయాలనే సిటిజన్ చార్టర్‎ను కూడా వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

Also Read:తీరం దాటిన బిపర్‌జాయ్‌..

రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల జనాభా ఉన్నదని, అందులో హైదరాబాద్‌లోనే కోటి మందికిపైగా ఉన్నారని తెలిపారు. కోటి మందికి సేవలు అందించేందుకు క్షేత్రస్థాయికి పాలనను విస్తరించామన్నారు. ప్రతి వార్డుకు పది మంది సిబ్బంది ఉంటారు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి వార్డుకు నేతృత్వం వహిస్తారని చెప్పారు. జవాబు దారితనం, సుపరిపాలన కోసం వార్డు కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే రాజకీయాలకతీతంగా పనిచేయాలని సూచించారు.

Also Read:ఇలా చేస్తే ఎంతటి పొట్ట అయిన మటుమాయం.. !

- Advertisement -