గత కొన్నాళ్లుగా ఏపీలో అధికార వైసీపీ జనసేన మధ్య రాజకీయ వివాదం ఏ స్థాయిలో కొనసాగుతోందో అందరికీ తెలిసిందే. వైసీపీ నేతలపై పవన్.. అలాగే పవన్ పై వైసీపీ నేతలు ఇలా ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకుంటూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారు. ఇక తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన పవన్.. ఆ తరువాత హాట్ హాట్ కామెంట్స్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు దేశం విడిచి వెళ్ళిన వాళ్ళ అహంకార దొరణి వైసీపీ నేతల్లో కనిపిస్తోందని పవన్ అన్నారు. వైసీపీ నేతలు భాద్యతతో వ్యవహరిస్తే సరేసరి.. లేదంటే మెడలు వంచి తోలు తీస్తామంటూ పవన్ తనదైన రీతిలో వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.
ప్రజస్వామ్యం అనేది జగన్, సజ్జల వంటి వారి సొత్తు కాదని, వేర్పాటు ధోరణితో వ్యవహరిస్తూ దేశ సమగ్రతకు భంగం కలిగించి.. మతాల మద్య చిచ్చు పెడితే చూస్తూ ఉరుకునేది లేదని పవన్ అన్నారు.. వైసీపీ నేతలు ఇలాగే చేస్తే త్వరలో తనలోని తీవ్రవాదిని చూస్తారని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పవన్ వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి వారు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. పవన్ తనను తాను తీవ్రవాదిగా చెప్పుకుంటున్నారని, అలా అయితే చట్టం తన పని తను చేసుకుపోతుందని బొత్స అన్నారు.
పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని, కేఏ పాల్ కు పవన్ కు తేడా లేదంటూ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి కూడా పవన్ పై విమర్శలు గుప్పించారు.. పవన్ ఎవరికోసం పని చేస్తున్నారో స్పష్టం చేయాలని, అలాగే చంద్రబాబు, లోకేశ్, పవన్ లలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలని సూచించారు. ఇలా వైసీపీ పై నిప్పులు చెరుగుతున్న పవన్ కు గట్టిగానే చురకలు అంటిస్తున్నారు వైసీపీ నేతలు.. మరి రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ మరింత వేడెక్కబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి…