వెంకీకి పవన్ బర్త్‌ డే విషెస్‌..

274
pawan
- Advertisement -

ఈ రోజు టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్‌ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు విషెస్‌ తెలుపుతున్నారు. తాజాగా హీరో పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ వెంకీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రత్యేక ప్రకటన చేశారు. మంచి మనసున్న సన్మిత్రుడు వెంకటేశ్ అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో వెంకటేష్‌తో తన స్నేహం చాలా ప్రత్యేకమైనదని వెల్లడించారు. తాను హీరో కాకముందు నుంచి వెంకటేష్‌తో పరిచయం ఉందని, తరచుగా వెంకటేష్‌తో మాట్లాడుతుండేవాడ్నని వివరించారు.

“ఆయన పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధ పుస్తకాలు చదివేవారు. ఆ పుస్తకాల్లోని సంగతులు వివరించేవారు. ఆ సంభాషణలు, చర్చలు మా స్నేహాన్ని మరింత బలోపేతం చేశాయి. ఇప్పటికీ మా మధ్య సినిమా సంగతులతో పాటు హైందవ ధర్మం, భక్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి.

ఆ స్నేహమే గోపాల గోపాల చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ సినిమా అద్దంపట్టింది” అని పవన్ వివరించారు. కొత్తతరం దర్శకుల కథలకు, ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకునే వెంకటేశ్ మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

- Advertisement -