ఇకపై 24 గంటలు ఆర్టీజీఎస్ సౌకర్యం..

218
rbi
- Advertisement -

నేటి అర్ధరాత్రి నుండి రియల్ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది ఆర్బీఐ. గతేడాది ప్రకటించిన విధంగా ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత 12:30 గంటల నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.

ఆర్టీజీఎస్ సేవలు ఇప్పటిదాకా పరిమితంగా ఉన్నాయి ఇకపై నెఫ్ట్ తరహాలో 24 గంటల పాటు ఆర్టీజీఎస్ సౌకర్యం అందుబాటలో ఉంటుందని వెల్లడించారు రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్. రెండు లక్షల రూపాయల వరకు ఆర్టీజీఎస్ కింద ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని తెలిపింది.

2004 మార్చి 26వ తేదీన ఆర్టీజీఎస్‌ను రిజర్వు బ్యాంకు ప్రవేశపెట్టింది. తొలుత నాలుగు బ్యాంకులకు మాత్రమే ఈ వ్యవస్థ అందుబాటులో ఉండగా క్రమంగా దీని సేవలను విస్తరించింది. ప్రస్తుతం రోజూ 6.35 లక్షల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు ఆర్టీజీఎస్ ద్వారా జరుగుతున్నాయి.

- Advertisement -