Pawan:ఆ సీటుపై పవన్ కన్ను?

21
- Advertisement -

ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం ఏదైనా ఉందా అంటే అది పవన్ పోటీ చేసే స్థానమే. ఎందుకంటే ఇటీవల ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత పవన్ పోటీ చేసే స్థానంపై మరింత చర్చ జరుగుతోంది. ఎందుకంటే తొలి జాబితాలో పవన్ పేరు లేకపోవడమే ఇందుకు కారణం. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ వంటి అగ్రనేతల సీట్లు కన్ఫామ్ అయినప్పటికి పవన్ పోటీ చేసే స్థానం మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. గత కొన్నాళ్లుగా ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని గట్టిగా వార్తలు వినిపిస్తున్నప్పటికి తొలి జాబితాలో పేరు లేకపోవడంతో అసలు పవన్ తాను పోటీ చేసే స్థానం విషయంలో ఏం ఆలోచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. రాజకీయ సమీకరణలతో పాటు, కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే సీటు కోసం పవన్ వేచిచూతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. .

భీమవరంలో ఆయనకు విశేషమైన అభిమాన ఘనం, ఉన్నప్పటికి కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కొంతమేర తక్కువే. పైగా గత ఎన్నికల్లో భీమవరం నుంచి ఓటమి చవిచూశారు పవన్. అందుకే కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పవన్ ఉన్నారని వినికిడి. పిఠాపురం సెగ్మెంట్ లో కాపు సామాజిక వర్గం ఓటర్లు 90 వేలకు పైచిలుకు ఉన్నారు. అందువల్ల ఇక్కడి నుంచి పోటీ చేస్తే కాపు ఓటర్ల మద్దతు అధికంగా ఉంటుందని తన గెలుపు సులువవుతుందని పవన్ ఆలోచిస్తున్నారట. అందుకే తొలి జాబితాలో తన పేరు లేకుండా పెండింగ్ లో ఉంచినట్లు సమాచారం. పార్టీ క్యాడర్ తో చర్చించి త్వరలోనే తాను పోటీ చేసే స్థానంపై పవన్ ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సస్పెన్స్ గా ఉన్న పవన్ సీటుపై క్లారిటీ వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. మరి పవన్ తాను పోటీ చేసే స్థానాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Also Read:మెగ్నీషియం లోపిస్తే.. ఇన్ని సమస్యలా?

- Advertisement -