పవన్..OG క్రేజీ అప్‌డేట్!

13
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం OG. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. ఓ ఈవెంట్‌లో ఓజీ ఫస్ట్ సింగిల్ గురించిన అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఓజీ ఫస్ట్ సింగిల్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింద‌ని తెలిపారు.

Also Read:HCU భూముల వివాదం…సుప్రీం సీరియస్

సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, మిగిలిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. పవన్ కల్యాణ్ సెట్స్‌లో అడుగుపెట్టిన రోజున అభిమానులకు గిఫ్ట్‌గా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

- Advertisement -