పవన్ చెల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అదేంటి, పవన్ కల్యాణ్‌కు చెల్లెలు లేదు కదా అని ఆశ్చర్యపోకండి. అన్నవరం సినిమాలో పవన్‌కు చెల్లిగా నటించిన సంధ్య గుర్తుందా. ఆమె కొద్దిరోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది.
ప్రేమిస్తే చిత్రంతో తెలుగు తెర కు పరిచయం అయినా సంధ్య , మొదటి చిత్రం తోనే అందర్నీ ఆకట్టుకుంది..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం చిత్రం లో పవన్కు చెల్లిగా నటించి అందరి చేత కంట తడి పెట్టించింది. అటువంటి ఈమె తాజాగా పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ ఆమె స్నేహితురాలు సుజ ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేసి వెల్లడించింది. సంధ్య గత సంవత్సరం వెంకట్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకొని , సినిమాలకు గుడ్ బై..చెప్పింది.
సంధ్య తమిళంలో 2004లో విడుదలై ఘన విజయం సాధించిన కాదల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమానే తెలుగులో ‘ప్రేమిస్తే’ అనే పేరుతో విడుదల చేశారు. ఇక్కడ కూడా ఆ సినిమా ఊహించని విజయం సాధించింది. తెలుగు, తమిళం, మలయాళం మూడు భాషల్లో మొత్తం 40 చిత్రాల్లో నటించి సంధ్య మెప్పించింది. డిష్యూం(తమిళ్), అన్నవరం(తెలుగు), ట్రాఫిక్(మలయాళం) సినిమాలు ఆమెకు మంచిపేరు తీసుకొచ్చాయి.