ఇందిరమ్మ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్..

217
- Advertisement -

మహిళలు ఆర్థికంగా గట్టిగా ఉండాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలో దత్తత్ర గ్రామాలైన ఎర్రవల్లి,నర్సన్నపేట గ్రామాల అభివృద్ధిపై సమావేశం నిర్వహించిన సీఎం మహిళలపై ప్రశంసలు గుప్పించారు. మహిళలు ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ బాగా చేస్తారని…వారిని ఎప్పుడూ తక్కువ చేయకూడదన్నారు. రష్యాలో 90 శాతం మహిళలు విమానాలు నడుపుతారని తెలిపారు.

అలాగే మన దేశంలో కూడా ఇందిరా గాంధీ దేశాన్ని అద్భుతంగా పరిపాలించిందని కితాబిచ్చారు. ఆడవాళ్లకు అవకాశం ఇస్తే అన్నీ సాధిస్తారన్నారు. ఇంటి పెత్తనాన్ని వాళ్లకే ఇద్దామన్నారు. పాలు, కోడిగుళ్లు అమ్మినా, వాళ్లు ఆ డబ్బులను కుటుంబానికే పెడుతారన్నారు.గ్రామాల అభివృద్ధిలో మ‌హిళ‌లు త‌మవంతు సాయం అందించాలని కోరారు. తమ ప్రయత్నమంతా రెండు గ్రామాల కోసమే కాదని, ఎర్ర‌వెల్లి, నరసన్న పేట గ్రామాలను చూసి మిగతా గ్రామాలన్నీ ఇలాగే తయారు కావాలని ఆయన అన్నారు.

అంకాపూర్ గ్రామంలో మహిళలే ఇంటి పెద్దలని…వారిచేతిలో ఫైనాన్స్ మేనేజ్ మెంట్ ఉండటం వల్లే వారు ఆర్ధికంగా ప్రగతి సాధిచగలిగారని తెలిపారు. ఇంటి పెత్తనాన్ని ఆడవారికి ఇవ్వాలని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు. దీని వల్ల దుబార తగ్గుతుందని…మన పిల్లలకు మంచిని అందించిన వాళ్లమవుతామని తెలిపారు.

- Advertisement -