అనుకు పవన్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..!

268
Pawan Kalyan Sent Appams to anu
- Advertisement -

‘మ‌జ్ను’ సినిమాతో తెలుగు తెర అరంగేట్రం చేసిన మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ… రెండో సినిమాగా రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న ‘కిట్టూ ఉన్నాడు జాగ్ర‌త్త’ అనే చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. చేసింది రెండు సినిమాలే అయినా పవన్ కళ్యాన్‌ సరసన నటించడానికి అవకాశం దొరికడంతో సంతోషంగా ఫీలైంది ఈ భామ. ఇక పవన్‌ కళ్యాన్‌ కూడా తన కో స్టార్స్‌ని ఎంతో మర్యాదగా చూసుకుంటాడన్న సంగతి తెలిసిందే. తన ఫామ్ హౌస్‌లో పండిన మామిడి పండ్లను స్నేహితులకు, తనకు నచ్చిన నటులకు పంపుతూ సర్‌ప్రైజ్ ఇస్తాడు పవన్. కాటమరాయుడు షూటింగ్ సమయంలో శివబాలజీ పుట్టిన రోజుకు కేక్‌తో సర్ ప్రైజ్ చేసిన పవర్ స్టార్, తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న సినిమా సెట్లో హీరోయిన్‌కు అలాంటి షాక్ ఇచ్చాడు.

Anu-Emmanuel-Latest-Hot-pictures

ఈ సినిమా షూటింగ్ సంద‌ర్భంగా ప‌వ‌న్ చేసిన ఓ ప‌ని గురించి అను బహిరంగ పరిచింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఓసారి ప‌వ‌న్.. నీకు ఇష్ట‌మైన ఆహారం ఏమిటి? అని అనును అడిగాడ‌ట‌. మాట‌ల మ‌ధ్య‌లో ఏదో స‌ర‌దాగా అడిగార‌నుకుని, త‌న‌కు అట్లు అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పింద‌ట‌. ఆ తరువాతి రోజు ఇంట్లో తయారు చేసిన అప్పం, కూరలను ఆమెకు పంపించాడట. పవన్ పంపిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని ఆయన తనపై చూపించిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేనని చెపుతుంది అను ఇమ్మాన్యూల్. అంతేకాదు తన సన్నిహితులందరి దగ్గర ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ ఆనందపడుతోంది. అలా పవన్ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్టును తన జీవితాంతం గుర్తించుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కీర్తీ సురేష్‌తోపాటు అను కూడా ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

- Advertisement -