విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప‌రిర‌క్ష‌ణ కోసం జ‌న‌సేనాని దీక్ష‌..

212
- Advertisement -

ఆదివారం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని త‌మ పార్టీ ప్రధాన కార్యాలయంలో దీక్ష‌కు దిగారు. ఈ ‘విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష’ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ పోరాటం చేస్తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని విశాఖ సభలోనూ పవన్ క‌ల్యాణ్‌ డిమాండ్ చేశారు. అయితే, ఆయ‌న డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించలేదు.

ఈ నేప‌థ్యంలోనే పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. కాగా, దీక్ష‌కు దిగే ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ గుంటూరు జిల్లా వ‌డ్డేశ్వ‌రంలో శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప‌రిర‌క్ష‌ణ కోసం త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. హైదారాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్,నాదెండ్ల మనోహర్ అక్కడి నుండ్‌ రోడ్డు మార్గాన మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

- Advertisement -