బాబు పై పవన్ రివర్స్.. పొత్తు గోవిందా?

21
- Advertisement -

గత కొన్నాళ్లుగా టీడీపీ జనసేన మద్య సీట్ల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది సీట్ల పంచాయతీ మరింత ముదురుతున్న ట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించే లక్ష్యంతో కూటమిగా ఏర్పడిన ఈ రెండు పార్టీలు పలు సీట్ల విషయంలో ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన పార్టీకి కేటాయించే సీట్ల విషయంలో టీడీపీ అధిష్టానం నిర్లక్ష్య ధోరణితో ఉన్నట్లు వినికిడి. 30-40 స్థానాలను జనసేన డిమాండ్ చేస్తుండగా.. అన్నీ స్థానాలను ఆ పార్టీకి కేటాయించడం చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అందుకే జనసేనతో సంబంధం లేకుండా ఆయా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తోంది టీడీపీ..

ఇటీవల చంద్రబాబు మండపేటలో అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మద్య జనసేన ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించిన సత్తెనపల్లిలో కూడా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. దీంతో సడన్ గా ఎన్నికల ముందు పొత్తును పట్టించుకోకుండా టీడీపీ అధిష్టానం అభ్యర్థుల ప్రకటన చేస్తుండటంతో పవన్ కూడా టీడీపీ తో సంబంధం లేకుండా రాజోలు, రాజానగరం వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి షాక్ ఇచ్చారు.

గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ మాట్లాడుతూ.. సీట్ల విషయంలో చంద్రబాబును తప్పుబట్టారు. పొత్తు ధర్మం ప్రకారం చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించకూడదు. కానీ ఆయన ఆ నిబంధన ఉల్లంఘించినందుకే తాము కూడా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్దమౌతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే కొన్ని స్థానాల్లో ఇరు పార్టీల మద్య సఖ్యత లేకపోయినప్పటికి ఎన్నికల్లో మాత్రం కలిసే పోటీ చేస్తామని మరోసారి నొక్కి చెప్పారు. అయితే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇరు పార్టీల మద్య కొంత ముసలం ఏర్పడినట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల సమయానికి పొత్తు ఇలాగే కొనసాగుతుందా ? లేదా పొత్తు బంధం సన్నగిల్లుతుందా అనేది చూడాలి.

Also Read:Harishrao:కాంగ్రెస్,బీజేపీ రహస్య మైత్రి

- Advertisement -