చిరుకు ప్రశంసల వెల్లువ

21
- Advertisement -

శివశంకర వరప్రసాద్‌… చిరంజీవిగా పేరు మార్చుకుని తనని తాను ఆవిష్కరించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి నంబర్‌ వన్‌ అనిపించుకున్నారు. తనతో పాటే… చిత్రసీమ స్థాయినీ పెంచారు. అందుకే చిత్రసీమ ఆయనను ప్రత్యేకంగా సుప్రీమ్‌ హీరోను చేసింది.. ఆ తర్వాత మెగాస్టార్‌గా మార్చింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి..సేవా గుణమే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ గౌరవానికి కారణమైంది. మెగాస్టార్‌ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పౌరపురస్కారం పద్మవిభూషణ్‌ ప్రకటించిన వెంటనే మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

ఈ ప్రతిష్ఠాత్మక పౌరపురస్కారం పై చిరు స్పందిస్తూ ‘నాకు దక్కిన ఈ గౌరవం మీది. అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నన్ను ఈ స్థాయిలో ఉంచాయి’ అని అన్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు కూడా మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. రక్తదానం, నేత్రదానం ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవి చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రశంసించారు. అలాగే అభిమానులు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read:Harishrao:కాంగ్రెస్,బీజేపీ రహస్య మైత్రి

- Advertisement -