- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీఫామ్‌లు అందించారు. బీజేపీతో పొత్తు నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించగా వారికి జనసేనాని నామినేషన్ పత్రాలను అందించారు.
బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలన్నారు పవన్. హోమ్ రూల్ ఉండాలనే ఉద్దేశంతో దశాబ్దకాలం పోటీకి దూరంగా ఉన్నామన్నారు. తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉంటామన్నారు. 2008లోనే తాను తెలంగాణవ్యాప్తంగా తిరిగి ఇక్కడి ప్రజల బాధలను అర్థం చేసుకున్నానని చెప్పారు. ఏపీపై దృష్టి సారిస్తూనే తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగానని వెల్లడించారు.
Also Read:‘రాజమౌళి’ని వదిలేసి రిస్క్ చేశాడా?
- Advertisement -