పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. నిజమేనా?

53
- Advertisement -

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన సెన్సేషనల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ఏం మాట్లాడినా కూడా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంచితే ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన జనసేన బీసీ సదస్సులో పాల్గొన్న పవన్ పలు కీలక వ్యాఖ్యాలు చేశారు. బీసీలు, కాపులు కలవాలని పవన్ సూచించిచారు, రాష్ట్రంలో బీసీలు కాపులు కలిస్తే రాజ్యాధికారం సాధించడం సులువని చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో బీసీలు, కాపులు కలిసి జనసేనకు అండగా నిలవాలని ఆయన అన్నారు.

అయితే గత ఎన్నికలకు ముందు వైసీపీకి బీసీలలో నుంచి అలాగే కాపుల నుంచి గట్టిగానే మద్దతు లభించింది. అయితే అధికారం చేపట్టిన తరువాత బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని జగన్ సర్కార్ పై కొంత వ్యతిరేకత ఉంది. బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ నిధుల విషయంలో జగన్ సర్కార్ పై వ్యతిరేక గళం వినిపిస్తున్నారు బీసీలు. ఇక కాపులకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని జగన్ సర్కార్ మీద గుర్రుగా ఉంది కాపు సామాజిక వర్గం. దాంతో ఈ రెండు సామాజిక వర్గాలను కలిపితే వచ్చే ఎన్నికల్లో జనసేనకు తిరుగుండదని పవన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో అండగా ఉంటరనుకున్న కాపులు పవన్ కు హ్యాండ్ ఇచ్చారు. కాపు సామజిక వర్గం అధికంగా ఉన్న గాజువాక, భీమవరం వంటి రెండు నియోజిక వర్గాల్లో పవన్ కు ఓటమి తప్పలేదు.

కానీ ఇప్పుడు కాపులు పవన్ పై కొంత సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు కమ్మ, రెడ్లు మాత్రమే అధికారం చేపట్టిన నేపథ్యంలో పవన్ గెలిస్తే కాపు సామజిక వర్గానికి మరింత మేలు జరుగుతుందని కాపులు ఆలోచిందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాపులు, బీసీలు కలిసి జనసేన విజయనికి పునాదులు వేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ చెబుతున్నా ఈయొక్క ఈక్వెషన్స్ ను వైసీపీ గట్టిగానే తప్పుబడుతోంది. పవన్ కాపులను, బీసీలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అని మంత్రి దాడిశెట్టి రాజ విమర్శించారు. మొత్తానికి పవన్ ఎత్తుకున్న ఈ కొత్త ఈక్వెషన్స్ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది.

ఇవి కూడా చదవండి…

హ్యాపీ బర్త్ డే….కవితక్క

సినీ ప్రేక్షకులకు పండుగరోజు: కేసీఆర్

కార్యకర్తలే పార్టీకి బలం: కేటీఆర్

- Advertisement -