తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి సహా పలు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తన సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్‌ను సమర్థవంతంగా నిర్వహించగలరనే నమ్మకం నిరూపితమైందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షలు విరాళంగా అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
కనీసం రూపాయి పారితోషికం తీసుకోకుండా ఈవెంట్ నిర్వహణ కోసం ముందుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.
Also Read:కేసీఆర్ బర్త్ డే..సేవా కార్యక్రమాలకు పిలుపు