రివ్యూ: పరిచయం

285
parichayam review
- Advertisement -

విరాట్ కొండూరు, సిమ్ర‌త్ కౌర్ జంట‌గా న‌టించిన చిత్రం ‘ప‌రిచ‌యం’. ఓ య‌దార్థ ఘ‌ట‌న ఆధారంగా తెరకెక్కిన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అసిన్ మూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై రియాజ్ నిర్మించారు. హైదరాబాద్ నవాబ్స్, నిన్నా నేడు రేపు సినిమాల తర్వాత లక్ష్మీకాంత్ చెన్నా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు
నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా లేదా చూద్దాం…

కథ:

ఆనంద్ (విరాట్ కొందూరు), ల‌క్ష్మి (సిమ్రత్‌ కౌర్‌) ఒకేరోజు, ఒకే ఆసుప‌త్రిలో జన్మిస్తారు. చిన్న‌ప్ప‌టి కలిసి పెరిగినా మ‌న‌సులోని మాట చెప్పుకొరు. సీన్ కట్ చేస్తే అనుకోని పరిస్థితుల్లో లక్ష్మి పురుగుల మందు తాగి గతం మర్చిపోతుంది. అసలు లక్ష్మి పరుగుల మందు ఎందుకు తాగింది..?లక్ష్మికి గతం గుర్తొచ్చిందా…?ఆనంద్,లక్ష్మి కలిశారా అన్నదే పరిచయం సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ సాంగ్స్, సినిమాటోగ్రఫీ. కొత్తవారే అయినా హీరో,హీరోయిన్లు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఎమోషన్‌ సీన్లలో విరాట్ నటన బాగుంది. సిమ్రత్ కౌర్ అందం సినిమాకు మరో ప్లస్ పాయింట్. రాజీవ్ కనకాల,పృథ్వీ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

parichayam movie review

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ క‌థ‌,సాగదీత స‌న్నివేశాలు,కామెడీ లేకపోవడం. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ ఓకే. కానీ.. దానిని ఈత‌రం వారికి ఆక‌ట్టుకునేలా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. శేఖ‌ర్ చంద్ర పాట‌లు సినిమాకు ప్లస్ పాయింట్. మెలోడీలు సినిమాల్లో చూడ్డానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

పిల్ల‌ల ప్రేమ‌ను పెద్ద‌లు అర్థం చేసుకోక‌పోవ‌డం, అడ్డు చెప్ప‌డం వంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం పరిచయం. ఇలాంటి కథను తెర‌పై చూపించ‌డం, అంద‌రికీ న‌చ్చేలా చేయ‌డం క‌ష్టం. అలాంటిదే తెరపై కనిపిస్తుంది. ప్రేమ,ఎమోషన్‌ని బ్యాలెన్స్‌ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో పర్వాలేదనించే మూవీ పరిచయం.

విడుదల తేదీ:21/07/2018
రేటింగ్:2 /5
నటీనటులు: విరాట్‌ కొందూరు, సిమ్రత్‌ కౌర్
సంగీతం: శేఖర్‌ చంద్ర
నిర్మాత: రియాజ్‌
దర్శకత్వం: ల‌క్ష్మీకాంత్ చెన్నా

- Advertisement -