సుమ తనయుడు హీరోగా ఎంట్రీ!

558
roshan
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీకి హీరోగా మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యాంకర్ సుమ-రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. ఆదివారం రోష‌న్ డెబ్యూ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జ‌ర‌గగా, గుడిలో శాస్త్రోక్తంగా స్క్రిప్ట్‌కు పూజలు చేశారు. ఈ మేరకు రాజీవ్ కనకాల వీడియోను షేర్ చేశాడు.

రోష‌న్ సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుట‌పెట్ట‌డం సంతోషంగా ఉందని తెలిపారు రాజీవ్ కనకాల. రోషన్‌కు ఇది డెబ్యూ చిత్రం కాగా ఈ సినిమాతో విజయ్ తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం కానున్నారు. జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండగా అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమా టీంని త‌ప్ప‌క ఆద‌రించాల‌ని రాజీవ్ కనకాల తెలిపారు.

https://youtu.be/Gcl0c1HAGuc
- Advertisement -