న‌టుడు దేవ‌దాస్ క‌న‌కాల ఇకలేరు..

238
devadas

ప్రముఖ నటుడు, కేరక్టర్ ఆర్టిస్ట్ దేవదాస్ కనకాల అనారోగ్యంతో మరణించారు. కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ ఆయ‌న ఈ రోజు సాయంత్రం క‌న్నుమూశారు. 1945, జూలై 30 యానంలో జ‌న్మించిన దేవ‌దాస్.. చ‌లిచీమ‌లు, నాగ‌మ‌ల్లి చిత్రాల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దేవాదాస్ కనకాల దర్శకుడిగా, రంగస్ధల కళాకారుడిగా కూడా రాణించారు. నాటక దర్శకత్వం నుంచి సినిమా దర్శకునిగా ఆయన ఎదిగారు. దేవ‌దాస్ కుమారుడు రాజీవ్ క‌న‌కాల కాగా, కుమార్తె శ్రీల‌క్ష్మీ.

హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ న‌డిపిన దేవ‌దాస్ క‌న‌కాల ఎంతో మందికి న‌ట‌న నేర్పించారు. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను, నటులను పరిచయం చేసిన నటగురువు దేవదాస్. స్టార్ హీరోలు కూడా చాలా మందే ఉన్నారు.

రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి నటులతో పాటు ఇంకా చాలా మంది ఆయన నట పాఠశాలలో శిక్షణ తీసుకున్న వాళ్లే. 1945లో జూలై 30న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.