పారాసిటమాల్ వాడుతున్నారా..జాగ్రత్త!

9
- Advertisement -

పారాసెటమాల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దీనిని సాధారణ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జలుబు, ఒళ్ళు నొప్పులు.. ఇలా సమస్య ఏదైనా ఒక్క పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను మాత్రమే పరిష్కారంగా ఎంచుకుంటూ ఉంటారు. దీనిని వేసుకోవడం వల్ల ఆయా ఆరోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందుతూ ఉంటారు. అయితే ఇలా అధికంగా పారాసెటమాల్ ఉపయోగించడం ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాధి తీవ్రతను బట్టి జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలకు పారాసెటమాల్ టాబ్లెట్ ఉపయోగించినప్పటికీ తరచూ దీనిని వేసుకోవడం వల్ల అదనపు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. ముఖ్యంగా పారాసెటమాల్ ఎక్కువగా ఉపయోగించే వారిలో లివర్ త్వరగా దెబ్బ తినే అవకాశం ఉందట. .\

అలాగే ఊపిరితిత్తుల పనితీరు కూడా మందగిస్తుందని పరిశోదనల్లో వెల్లడైంది. కొందరు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోయినప్పటికి పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఇది దుష్ప్రభావాలను ప్రేరేపించే అవకాశం చాలా ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ టాబ్లెట్ వికటించినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు, ముఖం వాపుగా మారడం, గొంతు నొప్పి, వికారం, కడుపు నొప్పి, అజీర్తి, అలసట, మైకం.. ఇలా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా అతిసార కు కూడా దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పారాసెటమాల్ టాబ్లెట్ ఉపయోగించే వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుడు సిఫారస్ చేసిన దాని ప్రకారం మాత్రమే ఈ టాబ్లెట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అలా కాకుండా స్వతహాగా వాడితే అదనపు ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’..

- Advertisement -