త్వరలో నల్లగొండలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి. నల్లగొండ పట్టణంలో మంగళవారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్లా..ప్రజలను మభ్య పెట్టడమే ప్రతిపక్షాల పనిగా మారిందన్నారు.
కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని.. తెలంగాణ రాష్ట్రం 14.2 శాతం వృద్ధి రేటుతో ముందంజలో దూసుకుపోతుందన్నారు. 43 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. 60 లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం అందజేస్తున్నట్లు చెప్పారు.
పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచి ప్రధాని మోదీ ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించిన పల్లా.. తన 6 ఏళ్ల పదవీ కాలంలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేసినట్లు తెలిపారు. మళ్ళీ ఒకసారి ఆశీర్వదించాల్సిందిగా గ్రాడ్యుయేట్స్‌ను కోరారు.