యాదాద్రిలో సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం

454
srinivas goud
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం నీరా పాలసీ జీవో విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో పాటు పెద్ద ఎత్తున గౌడ కులస్తులు పాల్గొన్నారు.

అంతకముందు యాదగిరిగుట్ట లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంను ప్రారంభించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో విప్ గొంగడి సునీత,ఎమ్మెల్సీ కృష్ణా రెడ్డి,ఎంపీ లింగయ్య యాదవ్,జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -