బిగ్ బాస్ హౌజ్ లోకి ఇస్మార్ట్ హీరోయిన్!

461
Nidhi Agarwal In Biggboss
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 ఎట్టకేలకు ఫైనల్ కు చేరుకుంది. ఇంకో ఐదు రోజుల్లో బిగ్ బాస్ 3 తెలుగు విజేత ఎవరో తేలనుంది. చివరి వారం శివ జ్యోతి హౌస్ లో నుంచి ఎలిమినెట్ కాగా ఇంకా ఐదుగురు సభ్యులు శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా, రాహుల్ లు ఉన్నారు. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు మాత్రమే బిగ్ బాస్ టైటిల్ తో పాటు రూ.50లక్షల నగదు గెలుచుకోనున్నారు.

కాగా ఫైనల్ ఎపిసోడ్ కు ఇప్పటి నుంచే అన్ని సిద్దం చేసుకుంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ విజేతను ప్రకటించేందుకు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చిరంజీవితో సంప్రదింపులు జరిపారట బిగ్ బాస్ యాజమాన్యం. మరోవైపు చిరంజీవి నాగార్జునకు చాలా దగ్గర కావడంతో అడగ్గానే ఒప్పేసుకున్నారని తెలుస్తుంది.

ఇక చిరంజీవితో పాటు ఫైనల్ ఎపిసోడ్ కు అట్రాక్షన్ గా హీరోయిన్లతో స్టెప్పులు వేయించనున్నారట. ఇందుకోసం ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ బిగ్ బాస్ స్టేజి మీద సందడి చేయనుందని సమాచారం. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ లోకి వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. మరోసారి తన డ్యాన్సులతో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించనుంది.

- Advertisement -