ఆఫ్ఘాన్‌లో పాక్ మంత్రి…నో హిజాబ్‌

214
- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కుల కాలరాస్తున్న వేళ ఆదేశాన్నికి పాకిస్తాన్ విదేశాంగా శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖర్ పర్యటిస్తున్నారు. ఆమె వెంట పాకిస్తాన్‌కు చెందిన విదేశాంగ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు ఉన్నారు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా…. అయితే అఫ్ఘన్‌ పర్యటన నేపథ్యంలో హీనా హిజాబ్‌ దరించకపోవడంతో ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చలకు దారితీసింది. ఆమె పర్యటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పాక్ ఆఫ్ఘన్ ల మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో తాలిబన్లతో దౌత్య సంబంధాల బలోపేతం గురించి చర్చించడానికి హీనా రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్‌తో వివాదాలున్న పాక్‌ ఆఫ్ఘన్‌తో సరిహద్దు వివాదాలు నెలకొన్నాయి. దీంతో తాలిబన్ల కాల్పుల్లో ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతే ఇరు దేశాల ఆర్థిక భారం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఇదే విషయంపై చర్చిస్తూ ఇరుపక్షాలు శాంతిని కోరుకుంటున్నాయని పరోక్షంగా సందేశాలు పంపుతున్నారు.

తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మహిళలపై వివక్షత పెరుగుతోంది. అమ్మాయిలు స్కూల్, కాలేజీలకు వెళ్లడాన్ని నిషేధించారు. మహిళలు మార్కెట్‌ లేదా మరేదైనా ప్రదేశానికి వెళ్లే సందర్భాల్లో ఆమెతో పాటు మగవాళ్లు సంరక్షకులుగా ఉండటం తప్పనిసరి. అలాంటి వాతావరణంలో పాక్‌ మంత్రి హీనా రబ్బానీ ఖర్ కాబూల్ పర్యటనలో విమానం దిగగానే ఆమె శైలిపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హిజాబ్ ధరించలేదు. కనీసం తలపై సాధారణ చున్నీ లేదా స్కార్ఫ్ కూడా లేదు. ఆఫ్ఘాన్‌ ప్రభుత్వ ప్రతినిధి స్థాయి చర్చల సందర్భంలో కూడా ఆమె హిజాబ్ ధరించకుండానే తాలిబాన్ నాయకుల ముందు కూర్చుని ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

జనన ధ్రవీకరణ పత్రం తప్పనిసరి…

ఇండియాకు ఫస్ట్‌ ‘గే’ జడ్జ్‌..!

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదా?

- Advertisement -