- Advertisement -
వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల పేర్లు ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం పంపాలని నిర్ణయించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.ఈ మేరకు పేర్లను ప్రతిపాదించాలని ప్రజలను కోరారు. ఆగస్ట్ 15వ తేదీలోగా అవార్డులకు పేర్లను padmaawards.delhi@gmail.com మేయిల్ చేయాలని సూచించారు.
పద్మ అవార్డులు (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) నామినేషన్లు, సిఫారసులను సెప్టెంబర్ 15 వరకు పంపాలని కేంద్రం సూచించింది. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ సైతం అవార్డుల కోసం నామినేట్ చేయాలని ప్రజలను కోరారు.
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు. 1954లో పద్మ అవార్డులను స్థాపించారు. ఈ అవార్డులు ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు.
- Advertisement -