పానీపూరీ తిన్న జపాన్ ప్రధాని..

22
- Advertisement -

భారత పర్యటనకు వచ్చిన జపాన్‌ ప్రధాని పుమియో కిషిదకు భారతదేశ వంటకాల రుచి చూశారు. భారతప్రధాని మోదీతో కలిసి కిషిద పానీపూరీ(గోల్‌గప్ప)ని తిన్నారు. జపాన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న కిషదకు ప్రధాని మోదీ జీ7సమ్మిట్‌కు ఆహ్వానించారు. అయితే భారత్ జపాన్ మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించేందుకుగానూ ఇరు దేశాల ప్రధానులు ఢిల్లీలోని బుద్ద జయంతి పార్క్‌ను సందర్శించారు.

ఇరువురు నేతలు పార్క్‌ కలియతిరుగుతూ వీరిద్దరూ ముచ్చటించారు. అనంతరం అక్కడ ఫుడ్‌ స్టళ్లు వద్దకు వెళ్లి భారత ఫేమస్ స్ట్రీట్‌ ఫుడ్‌ గోల్‌గప్పని ఆయనకు తినిపించారు. గోల్‌గప్ప రుచిని ఇష్టపడ్డ జపాన్ ప్రధాని కిషిద ఇంకోటి కావాలని అడిగారు. పానీపూరీతో పాటు ఫ్రైడ్ ఇడ్లీ మామిడితో చేసిన శరబత్‌ను కిషిద రుచి చూశారు. అనంతరం కిషదతో కలసి కవ్వంతో మజ్జిక చిలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. చందనపు చెక్కపై చెక్కిన బుద్ధుని ప్రతిమను బహూకరించారు. బాల్‌బోధి మొక్కను కిషిదకు మోదీ కానుకగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి…

పారిపోయినోళ్లను పట్టుకురావాలి..!

రాళ్లవాన..జిల్లాలకు సీఎం కేసీఆర్

ఈడీ అధికారికి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ..

- Advertisement -