ఎన్నో చూసింది.. ఆర్థికంగా నిలబడింది

53
- Advertisement -

అదృష్టం అందరి తలుపూ తట్టవచ్చు. కానీ, ఆ పిలుపు వినగలిగే నేర్పు ముచ్చెర్ల అరుణ లాంటి కొందరికే ఉంటుంది. పదేళ్ళకు పైగా సుమారు 70 చిత్రాలకు పైగా నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా సౌత్ అన్నీ భాషల్లో నటించింది. కారణం.. నటన ముచ్చెర్ల అరుణ అవసరం. కుటుంబ అవసరాల కోసం మొహానికి మేకప్ వేసుకుంది ముచ్చెర్ల అరుణ. ఒక్కోసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తాయి. కళ్ళకు కమ్మిన మసకలను అవి తొలగిస్తాయి అని తనకు తానే సర్ది చెప్పుకుని, నటిగా తనను తాను తీర్చి దిద్దుకుంది ముచ్చెర్ల అరుణ.

ముచ్చెర్ల అరుణకి మొదటి నుంచి ముక్కు మీద కోపం ఎక్కువ. ఆమె కోపానికి భయపడి, ఏ వంకర కన్ను ఆమెపై చూడలేదు అంటారు. మొత్తానికి ఆమె కోపం కూడా ముచ్చెర్ల అరుణ కు మేలే చేసింది. ఐతే, గ్లామర్ లోకంలో ఎక్కువ కాలం ఉండలేం అని ఓ నిర్ణయానికి వచ్చింది. తనను ఎగతాళి చెయ్యడం, తనను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడటం ఇవన్నీ ముచ్చెర్ల అరుణ దాటుకునే వచ్చింది.

బహుశా.. ఈ అనుభవాల రీత్యానే కావొచ్చు, ముచ్చెర్ల అరుణ తన జీవితాన్ని బాగా డిజైన్ చేసుకుంది. బిజినెస్ మెన్ జి. మోహన్ ను ముచ్చెర్ల అరుణ వివాహం చేసుకుంది. ఇప్పుడు చెన్నైలో మంచి బిజినెస్ మెన్స్ లో జి. మోహన్ కూడా ఒకరు. ఇప్పుడు ముచ్చెర్ల అరుణ ఆస్తుల విలువ కొన్ని వందల కోట్లు. ఒక తెలుగు నటి ఈ స్థాయికి వెళ్లడం విశేషం. ముచ్చెర్ల అరుణ లా కెరీర్ ను ప్లాన్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

నెక్ట్స్‌ లెవల్ రావణాసుర మూవీ..ఫరియా

పిక్ టాక్ : త్రిధా అందాలకు ఫిదా !

#NBK108..అప్‌డేట్

- Advertisement -