పారిపోయినోళ్లను పట్టుకురావాలి..!

43
- Advertisement -

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణలో అలజడులు సృష్టిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…ఏ ఆధారాలు లేకుండా ముందుగానే ఊహించుకొని కవితపై కేంద్ర మంత్రి కిషన్‌రె్డ్డి విమర్శలు చేశారని మండిపడ్డారు. సెల్‌ఫోన్లు ఉన్నాయా లేదా అని ప్రశ్నించకుండా ఫోన్లు పగులగొట్టారని కవిత మీద ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు.

నిన్న ఈడీ అధికారులు సెల్ ఫోన్లపై అడిగిన ప్రశ్నకు మంగళవారం తీసుకువస్తానని చెప్పి, ఓ లేఖ ఈడీ అధికారికి కవిత సమర్పించారన్నారు. దీనికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు.

తెలంగాణ ఆడబిడ్డపై ప్రతాపం చూపిస్తున్నారని అన్నారు. లక్షల కోట్ల స్కామ్‌లు జరిగిన వాళ్లను పట్టుకురావాలని ఈ సందర్భంగా కేంద్రంను డిమాండ్‌ చేశారు. వాళ్లను వదిలిపెట్టి వంద కోట్ల స్కామ్ అని చెప్పి తెలంగాణ ఆడబిడ్డను 10 రోజులుగా వేధిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు సృష్టించి అప్రదిష్టపాలుచేస్తున్నారన్నారు. ఈ రోజు కవిత ఈడీకి ఫోన్లు సమర్పించారని అన్నారు. ఏ ఆధారాలు లేకుండా విమర్శలు చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కవితకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి…

రాళ్లవాన..జిల్లాలకు సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులకు నమస్తే..!

మోడీజీ.. ఈ ప్రశ్న మీకే !

- Advertisement -