ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాములు నాయక్‌తోపాటు 200 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, బీసీ మహాసభ నాయకులు మెట్టుకాడి శ్రీనివాస్, ప్రభాకర్, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మత్రి మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అందరి సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ అలుపెరగని పోరాటం చేస్తున్నదన్నారు. అభివృద్ధికి కంకణం కట్టుకుని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మంత్రి బైక్ నడిపారు. అనంతరం రెడ్‌క్రాస్ సమావేశ మందిరంలో తెలంగాణ బీసీ మహసభ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రీబాయి 189వ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలాలు వేసి నివాళులు ఆర్పించారు.