‘అల్లుడు అదుర్స్’ నుండి అదిరిపోయే సాంగ్‌..

34
Hola Chica Lyrical Song

‘రాక్ష‌సుడు’ లాంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ‘హోలా చికా.. హోలా చికా..” అంటూ సాగే ఓ జోష్ ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది అల్లుడు అదుర్స్ చిత్రబృందం. ఇప్పటికే బెల్లంకొండ ఫ్యాన్స్ లో మోషన్ పోస్టర్ సాంగ్ న్యూ లుక్ తో అంచనాలు పెంచిన మేకర్స్ ఈ ‘హోలా చికా’ పాటతో ఆకట్టుకున్నారనే చెప్పాలి. కౌబోయ్ టైప్ కాస్ట్యూమ్స్ తో ఇద్దరు శ్రీనివాస్ నభా నటేష్ స్టైల్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ అదిరిపోయే సంగీతం అందించారు.

#AlluduAdhurs | Hola Chica Lyrical |Bellamkonda Sreenivas | Nabha Natesh | DSP