ఫస్ట్‌ సాంగ్ హిట్…సెకండ్ సాంగ్‌ ఫట్

263
priya warrior
- Advertisement -

ఒక్కసారి కన్నుకొట్టి లక్షలాది మంది ప్రేక్షకులను సంపాదించుకుని సోషల్ మీడియా క్వీన్‎గా మారింది ప్రియా ప్రకాశ్ వారియర్. భాష, ప్రాంతం అని తేడా లేకుండా ప్రియా ఓర చూపులకు జనాలు ఫిదా అయిపోయారు. ఓవర్‌ నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తొలిచిత్రం ఒరు ఆదార్ లవ్‌లో మాణిక్య మలరాయ పోవి పాటకు ప్రియా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పటికి గుర్తుకువస్తాయి.

తాజాగా ఈ చిత్రంలోని సెకండ్‌ సాంగ్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. రెండు రోజుల క్రితం యూ ట్యూబ్‌లో విడుదలైన ఈ పాటకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రియా అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు కానీ పాటపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటివరకు ఈ పాటను 5 లక్షల మందికి పైగా వీక్షించారు. 70 వేల మంది లైక్ చేస్తే 4 లక్షల 50 వేల మంది డిస్‌లైక్‌ కొట్టారు. ఫస్ట్ సాంగ్ బాగుందని కానీ సెకండ్‌ పాట బాలేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

- Advertisement -