అక్టోబర్‌ 5న విజయ్‌…నోటా

210
vijay devarakonda nota
- Advertisement -

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ‘నోటా’ మూవీతో తన రౌడీస్‌లో మళ్ళీ జోష్‌ పెంచేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆనంద్‌ శంఖర్‌ దర్శకత్వంలో వస్తున్న’నోటా’ మూవీ తెలుగుతో పాటు తమిళ బాషలోనూ రానుంది.విజయ్ కి జోడీగా..మెహ్రీన్‌ నటిస్తోంది. ఈ క్రమంలోనే చిత్రటీమ్‌ నోటా రిలీజ్‌ కి డేట్ ని కూడా ఫిక్స్‌ చేసింది.

అక్టోబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. సినిమా షూటింగ్ పూర్తైన విడుదల తేదీపై కొన్నాళ్లుగా సస్పెన్స్ నెలకొంది. తాజాగా సస్పెన్స్‌కు తెరదించుతూ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు నిర్మాతలు.

స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజ నిర్మిస్తుండగా ఈ సినిమాలో ఒక సాధారణ యువకుడిగా .. ముఖ్యమంత్రిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. విజ‌య్ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -